కీర్తి సురేష్ నటించిన "మహానటి" షూటింగ్ గండిపేటలో
- June 23, 2017
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి సావిత్రి. ఇప్పటి యంగ్ హీరోయిన్లు తమ ఇష్టమైన హీరోయిన్ ఎవరని అడిగితే..సావిత్రి అంటారు. కళ్లతో సైతం హావభావాలు పలికించగల గొప్ప నటి సావిత్రి. ఆమె జీవితంలో సంతోషాలు ఎన్ని ఉన్నాయో..కష్టాలు అంతకు రెట్టింపుగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తెలుగు, హిందీ చిత్రాల్లో ఎన్నో బయోస్కాపిక్ చిత్రాలు వచ్చాయి..మొదటి సారిగా మహనటి సావిత్రి జీవితం ఆధారంగా చేసుకొని "ఎవడే సుబ్రహ్మణ్యం" చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
"మహానటి" షూటింగ్ ప్రారంభమై ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ "స్వప్న సినిమా" పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్వప్న దత్ మాట్లాడుతూ.. "మలయాళ సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ "మహానటి"లో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది. నేటి నుంచి హైద్రాబాద్ లోని గండిపేటలో ప్రారంభమయిన తాజా షెడ్యూల్ లో దుల్కర్ పాల్గొన్నారు. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న "మహానటి" చిత్రం ఆవిడ అభిమానులకే కాక ప్రతి సినిమా అభిమానిని అలరించే విధంగా తెరకెక్కుతోంది.
ఇటీవల విడుదల చేసిన కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన లభించింది" అన్నారు. ఈ లాంగ్ షెడ్యూల్ లో మరింతమంది కీలకపాత్రధారులు కూడా పాల్గొననున్నారు. మిగతా పాత్రధారులు మరియు టెక్నీషియన్ల వివరాలు అతి త్వరలో వెల్లడిచేయనున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు!
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







