చెన్నై సిల్క్ భవనం శిధిలాల కింద కిలోల కొద్దీ బంగారం, వెండి

- June 23, 2017 , by Maagulf
చెన్నై సిల్క్ భవనం శిధిలాల కింద కిలోల కొద్దీ బంగారం, వెండి

చెన్నై సిల్క్ భవనం గురించి కొత్త న్యూస్ వినిపిస్తుంది.. తాజాగా సిల్క్ భవన శిధిలాల్లో 400 కిలోల గోల్డ్, 2 వేల కిలోల వెండితో ఉన్న పెద్ద బాక్స్ లు బయటపడ్డాయి. బహిరంగా మార్కెట్లో వీటి విలువ రూ. 120 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇంతకీ శిధిలాల కింద ఈ బాక్సులు ఎలా వచ్చాయి ? అన్నదానిపై అనుమానాలు మొదలయ్యాయి. మే 31న చెన్నై టీ.నగర్ లోని సిల్క్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభంవించింది. రెండు రోజులపాటు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనలో కోట్లాది రూపాయులు విలువైన వస్త్రాలు, నగలు కాలిపోయాయని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీంతో తమిళనాడు ప్రజాపన్నుల శాఖ, భవనాన్ని పూర్తిగా కూల్చివేసేందుకు 20 రోజులపాటు పనులను సాగించింది. శిధిలాలు తొలగించిన తర్వాత రెండు భారీ బాక్సులు కనిపించగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీటిల్లో  400 కిలోల బంగారం, 2 వేల కిలోల వెండి ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com