పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటా రామ్నాథ్ కోవింద్

- June 23, 2017 , by Maagulf
పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటా రామ్నాథ్ కోవింద్

రామ్నాథ్ కోవింద్ 
 రాష్ట్రపతి పదవి పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటుందని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ అన్నారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 'నేను గవర్నరుగా ఉన్న సమయంలో కూడా.. ఏ పార్టీకి అనుకూలంగా లేను. రాష్ట్రపతి అభ్యర్థిగా నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని అన్నారు. 'రాష్ట్రపతి పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడతాను. త్రివిధ దళాలపై సుప్రీం కమాండర్గా రాష్ట్రపతి ఉంటారు. మన దేశ సరిహద్దు భద్రతను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది'.. అని కోవింద్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా సీనియర్ నేతల సమక్షంలో కోవింద్ పార్లమెంటు భవనానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కోవింద్కు ఇప్పటికే అన్నాడీఎంకే, జేడీయూ, తెదేపా, టీఆర్ఎస్, శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com