మగాళ్లు కన్నా మాకేం తక్కువ : మిథాలీ ఆగ్రహం
- June 23, 2017
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మీ ఫేవరేట్ మేల్ క్రికెటర్ ఎవరు అని అడిగిన ఓ జర్నలిస్టుకు తేరుకోలేని షాకిచ్చింది. ఇదే ప్రశ్న మీరు ఓ మేల్ క్రికెటర్‌ని అడుగుతారా? మీ ఫేవరెట్ ఫిమేల్ క్రికెటర్ ఎవరు అని ఎప్పుడైనా అడిగారా? నాకు ఈ ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. కానీ మీరు వాళ్లను అడగండి అని మిథాలీ ఆ రిపోర్టర్‌కు క్లాస్ తీసుకుంది.
అంతేకాదండోయ్... మెన్ క్రికెట్‌కే ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు క్రికెట్ ఆడుతుంటూ అందరూ ఎగబడి చూస్తారని, అదే మహిళా క్రికెట్‌ను మాత్రం ఎవరూ పట్టించుకోరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మేం క్రికెట్ ఆడేటప్పుడు టీవీలు ఆఫ్ చేస్తారెందుకని ప్రశ్నించింది. కాగా, వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన వామప్ మ్యాచ్‌లో శ్రీలంకపై 85 రన్స్ చేసింది మిథాలీ. ఈ మ్యాచ్‌లో ఇండియా 109 రన్స్‌తో విజయం సాధించింది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







