ట్రాఫిక్‌ జరీమానాలపై డిస్కౌంట్‌: షేక్‌ మొహమ్మద్‌ ఆదేశం

- June 23, 2017 , by Maagulf
ట్రాఫిక్‌ జరీమానాలపై డిస్కౌంట్‌: షేక్‌ మొహమ్మద్‌ ఆదేశం

దుబాయ్:ఇయర్‌ ఆఫ్‌ గివింగ్‌ నేపథ్యంలో యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ట్రాఫిక్‌ మరియు ఇంపౌండ్‌మెంట్‌ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈద్‌ అల్‌ ఫితర్‌ ముందు రూలర్‌ ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా ట్విట్టర్‌ ద్వారా దుబాయ్‌ మీడియా ఆఫీస్‌ వెల్లడించింది. 2016 జులై 1 నుంచి 2016 డిసెంబర్‌ 31 వరకు నమోదైన జరీమానాలకు మాత్రమే ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. 2017 జనవరి నుంచి నమోదైన జరీమానాలకు ఈ డిస్కౌంట్‌ వర్తించదు. వాహనదారులు తమ జరీమానాల్ని పోలీస్‌ స్టేషన్లు, దుబాయ్‌ పోలీస్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌, వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ సెంటర్స్‌, ఫైన్‌ పేమెంట్‌ మెసీన్స్‌ వంటి వాటి ద్వారా చెల్లించడానికి వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com