నేటి నుంచి మోడీ మూడు దేశాల పర్యటన
- June 23, 2017
దిల్లీ: అమెరికాతో భారత్ భాగస్వామ్యం బహుళ అంచెలతో, భిన్నత్వంతో కూడుకున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఈ నెల 25,26 తేదీల్లో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో 26న భేటీ అవుతారు. అమెరికా పర్యటన గురించి మోదీ శుక్రవారం ఫేస్బుక్లో వివరిస్తూ భవిష్యత్తు దార్శనికత నిర్మాణమే ఈ పర్యటన లక్ష్యమన్నారు. అమెరికాతో భారత్ సంబంధాలు కేవలం రెండు ప్రభుత్వాలకు మాత్రమే సంబంధించినవి కాదని, రెండు వైపులా భాగస్వాములందరికీ సంబంధించినవని చెప్పారు. గతంలో ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన సంగతిని ప్రధాని ఫేస్బుక్లో గుర్తు చేశారు. ట్రంప్, ఆయన మంత్రివర్గ సహచరులతో అధికారిక సమావేశాలతో పాటు అమెరికా సీఈవోలతో సమావేశమవుతున్నానని, ప్రవాస భారతీయులతోనూ సంభాషిస్తానని తెలిపారు. ట్రంప్ ఆహ్వానంపై తాను అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని ఈ నెల 24న పోర్చుగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని కోస్తాతో భేటీ అవుతారు. 27న నెదర్లాండ్స్ వెళ్లి ప్రధాని మార్క్ రట్టెతో భేటీ అవుతారు.
* డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







