దుబాయ్‌లో షూటింగ్ జరుపుకోనున్న 'సాహో'
- June 24, 2017
‘బాహుబలి’ హ్యాంగోవర్ నుంచి ప్రభాస్ బయటికొచ్చేశారు. ప్రస్తుతం చేస్తున్న ‘సాహో’లో పూర్తిగా లీనమైపోయారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. మరో షెడ్యూల్ కోసం ఈ యూనిట్ దుబాయ్ వెళ్లనుందట.
ప్రపంచంలో అత్యంత ఎల్తైన భవనం అయిన అక్కడి బుర్జ్ ఖలీఫా పరిసర ప్రాంతాల్లో ప్రభాస్, విలన్ నీల్ నితిన్ముఖేష్లపై హాలీవుడ్ లెవల్లో యాక్షన్ సీన్స్ తీయనున్నారని సమాచారం. ఇంకా పలు కీలక సన్నివేశాలను తీయడానికి కూడా ప్లాన్ చేశారట. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ఇంకా కథానాయిక ఫైనలైజ్ కాలేదు. టాలీవుడ్ తారలతో పాటు పలువురు బాలీవుడ్ నాయికల పేర్లను పరిశీలిస్తున్నారని భోగట్టా.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









