కెనడాలో న్యాయమూర్తిగా తొలి భారతీయురాలు

- June 24, 2017 , by Maagulf
కెనడాలో న్యాయమూర్తిగా తొలి భారతీయురాలు

న్యూవెస్ట్ మినిస్టర్: భారత సంతతికి చెందిన పల్బీందర్ కౌర్ షెర్గిల్ న్యూవెస్ట్ మినిస్టర్లోని సుప్రీంకోర్టు ఆఫ్ బ్రిటీష్ కొలంబియాకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కెనడాలోని సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులైన తొలి సిక్కు మహిళగా షెర్గిల్ చరిత్ర సృష్టించారు. కెనడా అటార్నీ జనరల్ జోడీ విల్సన్-రేబౌల్డ్ షెర్గిల్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. న్యాయమూర్తి జస్టిస్ ఈఏ అర్నాల్డ్ బైలే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో షెర్గిల్ నియమితులయ్యారు. మానవహక్కుల న్యాయవాదిగా పనిచేస్తున్న షెర్గిల్ కెనడియన్ సిక్కు కమ్యూనిటీ తరపున పలు కేసులను వాదించారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా షెర్గిల్ నియామకాన్ని వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ముఖ్బీర్ సింగ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేశారు. పంజాబ్లోని జలంధర్ జిల్లాకి చెందిన షెర్గిల్కు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె కుటుంబం కెనడాకు వలస వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com