హైదరాబాద్‌లో రక్తం కల్తీ..
- June 24, 2017
హైదరాబాద్ కల్తీ మయం అయిపోతోంది. పాలు.. ఆహార పదార్థాల కల్తీ నుంచి మరో మెట్టు ఎక్కి.. రక్తాన్ని సైతం కల్తీ చేసే దశకు చేరుకుంది. అధికారుల అలసత్వాన్ని సాకుగా చేసుకుని.. రెచ్చిపోతున్నారు కల్తీ రాయుళ్లు. రోగుల ప్రాణాలను కాపాడే రక్తాన్ని సైతం కల్తీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని ఎందరో దాతలు ఇచ్చిన రక్తంతో .. కల్తీ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ బ్లడ్ బ్యాంక్.. ఓ నెగిటివ్ రక్తాన్ని ఇలానే కల్తీ చేసి అమ్మేసింది.
రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. రోగుల ప్రాణాలు కాపాడడం కోసమే పనిచేయాల్సిన బ్లడ్‌బ్యాంకులు.. వారి ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ బ్లడ్‌బ్యాంక్.. కల్తీ చేసిన రక్తాన్ని సరఫరా చేసి అడ్డంగా దొరికిపోయింది. పొరపాటున ఆ రక్తాన్ని రోగికి ఎక్కించి ఉంటే.. అతడి ప్రాణాలకే ప్రమాదం సంభవించేది. వైద్యులు అప్రమత్తంగా ఉండడంతో.. బ్లడ్‌బ్యాంక్ అరాచకం బయటపడింది.
మలక్‌పేటలోని వీనస్ హాస్పిటల్‌లోని బ్లడ్‌బ్యాంక్.. ఈ ఘోరానికి పాల్పడింది. అరుదుగా లభించే ఓ నెగిటివ్ బ్లడ్లోకి.. MH గ్లూకోజ్ వాటర్‌ను మిక్స్ చేసి కల్తీకి పాల్పడింది. అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం కావాలంటూ వచ్చిన రోగి బంధువులకు ఈ ప్యాకెట్‌ను అమ్మేసింది.
రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నర్సింహారెడ్డి.. ఎల్బీనగర్ సాగర్ రింగ్‌రోడ్ సమీపంలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో ఓ నెగిటివ్ రక్తం లేకపోవడంతో.. మలక్‌పేటలోని వీనస్ హాస్పిటల్‌లోని బ్లడ్ బ్యాంక్‌లో 3 వేల రూపాయలు చెల్లించి బ్లడ్ ప్యాకెట్ తెచ్చారు. అయితే.. నర్సింహారెడ్డికి రక్తం ఎక్కించడానికి ముందు.. పరీక్షించిన అవేర్ గ్లోబల్ ఆస్పత్రి సిబ్బంది.. అందులో MH గ్లూకోజ్ వాటర్ కలిసిందంటూ తేల్చారు.
రక్తాన్ని సైతం కల్తీ చేశారని తెలుసుకుని నివ్వెరపోయిన నర్సింహారెడ్డి బంధువులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వీనస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు నిర్వహించారు SOT పోలీసులు. బ్లడ్‌బ్యాంక్‌ను సీజ్ చేసి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకులు డాక్టర్ చక్రవర్తి, శ్రవణ్‌లను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







