భరత్ అంత్యక్రియలు పూర్తి
- June 25, 2017
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సోదరుడు భరత్ అంత్యక్రియలకు హీరో రవితేజ హాజరుకాలేదు. తమ్ముడు భౌతికకాయాన్ని చివరి చూపు కూడా చూడలేనని రవితేజ చెప్పారు. భరత్ భౌతికకాయాన్ని చూడడానికి ఆయన తల్లి కూడా ఇష్టపడలేదు. దాంతో కుటుంబసభ్యులు ఎవరూ లేకుండానే భరత్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. కేవలం కొద్దిమంది మిత్రులు, పరిచయస్తులు మాత్రమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యారు.
30 ఏళ్లుగా తమ్ముడు భరత్‌తో ఉన్న అనుబంధాన్ని రవితేజ గుర్తు చేసుకుంటూ..భౌతిక కాయాన్ని కూడా చూడలేనని అన్నారు. భరత్ భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రి నుంచి నేరుగా మహాప్రస్థానానికి తరలించారు. రవితేజ మూడో సోదరుడు రఘు మాత్రమే ఈ అంత్యక్రియలను పర్యవేక్షిస్తున్నారు. కుటుంబసభ్యులందరూ శోకసంద్రంలో ఉన్నారు. అంత్యక్రియలకు ఎవరూ రాలేకపోతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటూ రవితేజ మీడియాకూ, మిత్రులకు చెప్పారు.
టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డుప్రమాదంలో మరణించారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. కారు సగభాగం లారీ కిందకు దూసుకువెళ్లడంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందారు
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







