అక్కడ చిరుతో.. ఇక్కడ బన్నీతో!

- June 27, 2017 , by Maagulf
అక్కడ చిరుతో.. ఇక్కడ బన్నీతో!

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ కథానాయకుడిగా 'జయదేవ్' అనే సినిమా తెరకెక్కుతుంది. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో ఏర్పాటు చేసి దీనికి ముఖ్య అతిథిగా చిరంజీవిని పిలిశారు. ఇప్పుడు ఇదే ఫంక్షన్ను వైజాగ్ నోవాటెల్లో ఈ నెల 28న జరుపనున్నారు. ఈ ఫంక్షన్కి అల్లు అర్జున్ని గెస్ట్గా పిలిచారట. గంటా ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో బన్నీ వెంటనే ఓకే చెప్పేశాడట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com