ఆర్థిక ఇబ్బందులతో స్టాఫ్‌ని తొలగించిన అల్ వసాత్
- June 27, 2017
మనామా: స్థానిక అరబిక్ డైలీ తమ సిబ్బందిని తొలగించే పనిలో బిజీగా ఉంది. అధికారిక వర్గాలు ఈ పత్రికపై సస్పెన్షన్ వేటు వేయడంతో నిర్వహణా సమస్యలతో సిబ్బందిని తొలగించాల్సి వస్తోంది. సుమారుగా 180 మంది సిబ్బందిని ఇప్పటికే తొలగించారు. అందులో 39 మంది వలసదారులున్నారు. బోర్డ్ ఛైర్మన్ అదెల్ అల్ మస్తకి, స్టాఫ్‌ని ఉద్దేశించి పేర్కొన్న విషయమేమిటంటే, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్స్‌ని ఎంప్లాయీస్‌తో రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అల్ వసత్ అధినేత దార్ అల్ వాసత్‌కి ఎదురైన నష్టాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్ మస్కతి పేర్కొన్నారు. జూన్ 4న ఇన్ఫర్మేషన్ ఎఫైర్స్ అథారిటీ ఈ న్యూస్ పేపర్‌ని రద్దు చేసింది. సమాజంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందనీ, బహ్రెయిన్‌కి ఇతర దేశాలతో సంబంధాల్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అభియోగాలు ఎదుర్కొంటోంది ఈ పత్రిక. పత్రికలో ఓ కాలమిస్ట్, మొరాకోలోని పరిస్థితుల్ని విమర్శించడంతో అధికారిక వర్గాలు చర్యలకు ఉపక్రమించాయి.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







