మ్యారేజ్ సర్టిఫికెట్ ఫోర్జరీ: వ్యక్తికి జైలు
- June 29, 2017
తన భార్య కోసం వీసా పొందేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్‌ని ఫోర్జరీ చేసినందుకుగాను ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. జులై 12న నిందితుడ్ని అరెస్టు చేయడం జరిగింది. భార్య వీసాకి సంబంధించి ప్రాసెస్ పూర్తి చేసుకునే క్రమంలో నిందితుడు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్‌ని సంప్రదించిన సందర్భంగా నిందితుడి నేరాన్ని గుర్తించారు. శ్రీలంకకు చెందిన వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫోర్జరీ సర్టిఫికెట్ కోసం 1,200 దిర్హామ్‌ని చెల్లించినట్లుగా న్యాయస్థానం యెదుట వెల్లడించాడు. కొలంబోలోని యూఏఈ ఎంబసీకి చెందిన స్టాంప్‌ని ఫోర్జరీ చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. న్యాయస్థానంలో విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు. అయినప్పటికీ అతనికి జైలు శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం, జైలు శిక్ష పూర్తయిన అనంతరం డిపోర్టేషన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







