గుమ్మడి కాయ వాల్‌నట్స్ కేక్
- July 06, 2017
కావలసిన పదార్థాలు: గుడ్లు - 2, గుమ్మడి గుజ్జు - 1 కప్పు, నూనె అర కప్పు, వెనిలా ఎసెన్స్ - 1 టీ స్పూను, పంచదార - 1 కప్పు, మైదా - ఒకటిన్నర కప్పు, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, జాజికాయ పొడి - పావు టీ స్పూను, బేకింగ్ సోడా - అర టీ స్పూను, ఉప్పు - చిటికెడు, వాల్‌నట్స్ తరుగు - అర కప్పు.
తయారుచేసే విధానం: లోతైన వెడల్పాటి పాత్రలో గుడ్లు, గుమ్మడి గుజ్జు, నూనె, వెనీలా ఎసన్స్ వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులోనే మైదా, పంచదార, దాల్చినచెక్క, జాజికాయ పొడులు, ఉప్పు, బేకింగ్ సోడా వేసి ఉండలు లేకుండా మరోసారి గిలకొట్టాలి. తర్వాత వాల్‌నట్స్ కలపాలి. ఓవెన్‌ను 350 డిగ్రీల (ఫా.హీ) దగ్గర ప్రీ హీట్ చేసుకుని వెన్న రాసిన దళసరి పాత్రలో పోసిన గుమ్మడి మిశ్రమాన్ని 35 నుండి 40 నిమిషాలు ఉంచాలి. చల్లారిన తర్వాత కేక్‌ను ముక్కలుగా కట్ చేసుకొని మర్రోజు తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడే బలమైన ఆహారం కూడా.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







