నటుడు అజిత్ పేరు ఏకే!
- July 07, 2017
ప్రస్తుతం అందరూ భిన్నమైన ప్రచారం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో తమ సినిమాకు ఏ మాత్రం ప్రచారం అక్కర్లేదని చెబతూ... గెలుపోటముల గురించి ఏ మాత్రం పట్టించుకోని నటుడు అజిత్. బాగుంటే అభిమానులు, ప్రేక్షకులు చూస్తారని తన మటుకు తను సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో 'వివేగం'లో నటిస్తున్న విషయం తెలిసిందే. గురువారంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా 2.20 గంటల నిడివి ఉన్నట్లు సమాచారం. మూడు భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం దర్శకుడు శివ రెండు పాటలను సైతం రాశారు. ఈ సినిమా గురించి దర్శకుడు శివ చెప్పిన విశేషాలు...
* అజిత్తో 'ఆరంభం' చిత్రీకరణ సమయంలో ఆయన కాలికి దెబ్బ తగిలింది. మళ్లీ 'వేదాలం' చేస్తున్నప్పుడు అదే చోట పెద్ద దెబ్బ తగిలింది. కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. వైద్యులు ఎంతో శ్రమకోర్చి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. అలాంటిది ఆయన నాతో మళ్లీ 'వివేగం' చేయడం అదృష్టం.
* అజిత్లో చూసింది ఆత్మవిశ్వాసమే. 'వివేగం' కథ చెప్పాక.. ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడొచ్చు అన్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు వ్యాయామం చేసేవారు.
* 'వివేగం'లో అజిత్ పేరు 'ఏకే'. టీజర్ చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అజిత్ ఇంటర్నేషనల్ ఏంజెటా.. రెండు పాత్రలా?.. రెండు గెటప్లా?.. అని అడుగుతున్నారు. సినిమా చూస్తే మరింత ఆశ్చర్యపోతారు. అందుకు తగిన సమాధానం కూడా దొరుకుతుంది.
* అజిత్కు పంచె, చొక్కా వేయించి అందంగా చూడాలనుకున్నా. ఆ మాట చెప్పగానే.. 'వీరం' సినిమాను చేసే అవకాశమిచ్చారు. ఉత్తర చెన్నై వ్యక్తిగా 'వేదాలం'లో చూపించా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏజెంట్గా చూపించనున్నా. మొత్తానికి దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చే వ్యక్తి ఆయన.
* 'వీరం', 'వేదాలం' హిట్ అయినందున 'వివేగం' అవకాశం ఇచ్చారని భావించడం లేదు. నాపై, నా జట్టుపై ఉన్న నమ్మకంతోనే ఆయన ఈ అవకాశం కల్పించారు.
* పది రోజులు కుటుంబానికి దూరంగా ఉంటేనే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అలాంటిది.. 70 రోజుల పాటు విదేశాలల్లోనే చిత్రీకరణ జరిపాం. ఈ సినిమాలోని 97 శాతం చిత్రీకరణ విదేశాలల్లోనే జరిగింది. అంతర్జాతీయ కథతో అల్లుకున్న సినిమా కావడంతో విదేశాలల్లోనే చిత్రీకరణ జరిపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* మేం వెళ్లిన జార్జియా వంటి దేశాల్లో ఉదయం 9 గంటలకు వచ్చే లైటింగ్ సాయంత్రం 3.30 కల్లా ముగిసిపోతుంది. మరోవైపు మైనస్ డిగ్రీల్లో కూడా చిత్రీకరణ జరిపాం.
* ఈ చిత్రం కోసం సైనిక యుద్ధ ట్యాంకులు, మిలిటరీ వ్యాగన్లు, హెలికాప్టర్లను వినియోగించాం. తప్పనిసరిగా ఇంటర్నేషనల్ సినిమా లుక్ కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టును అజిత్ చేయడం, దానికి సత్యజ్యోతి ఫిలిమ్స్ సహకరించడం ఆనందంగా ఉంది.
* 'ఇది నాకు 47వ చిత్రం. ఇలాంటి ఓ చిత్రం, పాత్రను ఇదివరకు నేను పోషించలేదు.' అని కాజల్ నాతో చెప్పారు. తప్పకుండా వీరిద్దరి కాంబినేషన్ వైవిధ్యంగా ఉంటుంది.
* ఈ సినిమాలో సాంకేతికతను పెద్ద స్థాయిలో ఉపయోగించాం. 'హాలీవుడ్ స్థాయి టీజర్ను చూసినట్లు ఉంది' అని పలువురు ప్రేక్షకులు టీజర్ గురించి చెప్పడంతో మా ప్రయత్నం ఫలిస్తోందని అనిపిస్తోంది.
* కథ చెప్పేటప్పుడే ఆశ్వాదించేతత్వం సంగీత దర్శకుడు అనిరుధ్ది. థియేటర్లో ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోననే విషయాన్ని అనిరుధ్కు కథ చెప్పేటప్పుడే అర్థమైపోతుంది. ఈ సినిమాలో కూడా ఆయన సంగీతానికి పెద్ద గుర్తింపు దక్కుతుంది.
* ఇందులో హాస్యానికి కొదవవుండదు. కరుణాకరన్ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తారు. విదేశంలో పుట్టి పెరిగిన తమిళ యువకుడి పాత్రలో కనిపిస్తారు. 'యాప్స్' ఆయన పాత్ర పేరు.. అని వివరించారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









