నజరాన్ లో అగ్ని ప్రమాదానికి గురైన పెట్రోల్ స్టేషన్ : నివాసితుల తరలింపు
- July 07, 2017
నజరాన్: నజరాన్ నైరుతి ప్రాంతంలో ఉన్న పెట్రోల్ స్టేషన్ లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం గురైంది. దీంతో ఆ సమీపంలో ఉన్నభవనంలోనివాసితులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయిస్తూ వేరే ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ప్రాంతీయ కార్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ శుక్రవారం " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు. ఒక ట్యాంకర్ఇంధనంను స్టేషన్ లో నింపే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నంలో దాదాపు 25 మంది అపార్ట్మెంట్ భవనంలో నివసిస్తున్నారు. నలుగురు పౌరులు పొగ పీల్చడం ద్వారా ఊపిరి అందకపోవడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ అగ్ని ప్రమాదంలో రెండు కార్లు, ఐదు దుకాణాలు అగ్నిప్రమాదంలో తగలబడిపోయాయి. భద్రతా విధానాలను పరిశీలించడంలో విఫలమైన ఫలితంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా ఉందని అగ్నిమాపక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







