బహ్రైన్ కారాగార కాపలాదారులకు మానవ హక్కుల గురించిన శిక్షణ

- October 16, 2015 , by Maagulf
బహ్రైన్ కారాగార కాపలాదారులకు మానవ హక్కుల గురించిన శిక్షణ

కారాగార వాసులతో మరింత పరస్పరత పెంపొందించేందుకు బహ్రైన్ కారాగార కాపలాదారులకు మానవ హక్కులను గురించిన శిక్షణ ఇవ్వబడుతోంది. ఈ సంవత్సరం మార్చి నెలలో కారాగారాల పరిస్థితుల గురించి, 55 మంది ఖైదీలను ఇంటర్వ్యూ చేసిన అనంతరం నేషనల్ ఇన్‌స్టీట్యూట్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎన్. ఐ. హెచ్. ఆర్.) వారి నివేదిక ప్రకారం ఈ చర్య తీసుకోబడుతోంది. 2009 వ సంవత్సరంలో హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ వారిచే బహ్రైన్ హక్కుల నివేదికలను తయారుచేయడానికి, రాష్ట్ర యంత్రాంగాలతో కలసి పనిచేయడానికి ఏర్పాటుచేయబడిన సంగతి విదితమే. ఈ శిక్షణ వలన జైలు శిక్ష అనేది ఖైదీల మానసిక వికాశనికే తప్ప, వారిని నీచంగా చూడడానికి కాదని వారికి అవగతమై, వారు ఖైదీలను మానవత దృస్తితో చూడడానికి ఉపకరిస్తాయని ఎన్. ఐ. హెచ్. ఆర్. ఉపాధ్యక్షులు డా. అబ్దుల్లా అల్ దీరజి  తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com