మంచాన పడి ఆర్ధిక సహాయం అర్థిస్తున్న ప్రవాసీయ భారతీయుడు

- July 07, 2017 , by Maagulf
మంచాన పడి ఆర్ధిక సహాయం అర్థిస్తున్న ప్రవాసీయ భారతీయుడు

మనామ: గత 12 సంవత్సరాలుగా బహ్రెయిన్ లో నివసిస్తున్న భారతీయ ప్రవాస భారతీయుడు ఆరోగ్యం పాడవడంతో  సల్మనియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్. ఎం.సి.) లో చేరడంతో పాటు ఆర్థిక సహాయం చేసేవారు లేకపోవంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.  ఒక పంప్ ఆపరేటర్ గా పని చేస్తున్న సునీల్ కుమార్ 46, మే 29 న తలనొప్పి మరియు వాంతులు రావడంతో ఆసుపత్రికి తీసుకు వచ్చారు, దీని వలన ఆయన స్పృహ కోల్పోయాడు. వైద్యపరమైన నివేదికలు ప్రకారం ఆయనకు స్ట్రోక్ సంభవించడంతో పాటు  మెదడులో రసాయనిక మార్పులు జరిగి రక్తం గడ్డ కట్టడం జరిగిందని తెలుస్తుంది. "సునీల్ ప్రస్తుతం  సల్మనియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్. ఎం.సి.)  వద్ద పాక్షిక పక్షవాతానికి గురయ్యాడని ఆయనను వెంటనే భారతదేశానికి వెంటనే పంపాలని వైద్యులు సూచిస్తున్నారు.ఎందుకంటే ఇద్దరు  పారామెడికల్ సిబ్బంది సహాయంతో సునీల్ కుమార్ ను తోడుగా పంపవల్సి ఉంది. ఇందుకై 3000 బిడి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది," అని ఒక  ఐ సి ఆర్ ఎఫ్ స్వచ్చంద కార్యకర్త చెప్పారు. ఆయనకు ఆర్ధిక సహాయం చేసేందుకు కానీ ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని తమలాగే మరికొందరు  ప్రజలు ముందుకు వచ్చి వైద్య చికిత్స కోసం ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని కోరారు. తన కుటుంబంలో సునీల్ మాత్రమే సంపాదనపరుడు కావడంతో ఈ వైద్య అవసర రిస్థితిలో వారివద్ద డబ్బు లేదని  తన కుటుంబం అంత పెద్ద మొత్తంలో సమకూర్చడం సాధ్యం కాలేదు,ఆయన కుటుంబంతో కల్సి మిగిలిన  ఒక మంచి జీవితం జీవించడానికి దాతలు ఆర్ధిక సహాయం చేయాలనిఆ స్వచ్ఛంద కార్యకర్త  పేర్కొన్నారు. సునీల్ కు  విరాళంగా డబ్బుని ఇవ్వాలని కోరుకునే వారు  సుధీర్ తిరునీలట్ ఫోన్ చేసి  39461746 మరిన్ని వివరాల కోసం  సంప్రదించాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com