డబ్బు ఇవ్వకపోతే ఫోటోలు చూపిస్తానన్న మహిళను బెదిరిస్తున్న ఒమనీ వ్యక్తి అరెస్ట్
- July 07, 2017
మస్కట్ : ఆన్ లైన్ లో..ఆడపేరుతో ఉన్న ఒక మేకవన్నె పులి మాదిరిగా ఉన్న మగాడిని గుడ్డిగా నమ్మింది ...తన వ్యక్తిగత విషయాలను పూసా గుచ్చినట్లు చెప్పడమే కాక, అందుకు సంబంధించిన ఫోటోలను ఆ అపరిచిత వ్యక్తికి పంపింది..వాటినన్నింటిని జాగ్రత్త చేసుకొని....తన ఫోటోలను తనకి పంపి భారీ మొత్తంలో డబ్బు ఇవ్వకపోతే పరువును బజారున పెడతానన్న నిందితుడిపై పిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించింది ఒక మహిళను 6,000 రియల్ ఒమాన్ డబ్బును ఇవ్వవలసిందిగా బెదిరించినందుకు బురైమి నుండి ఒక ఒమన్ వ్యక్తిని రాయల్ ఒమాన్ పోలీసులు అరెస్టు చేశారు..ఒకరు, "ఒక వ్యక్తి తనను బెదిరిస్తున్నట్లుగా ఒక ఒమాని మహిళ బురైమి పోలీస్ స్టేషన్ లో రాయల్ ఒమాన్ పోలీస్ అధికారికి ఫిర్యాదు చేసింది.వాట్స్ అప్ నుంచి నిందితుడు వేధిస్తున్నట్లు తానూ ఒక అమ్మాయినని తనను సంప్రదించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కొంత కాలవ్యవధిలో కొన్ని వ్యక్తిగత చిత్రాలను వాట్స్ అప్ ద్వారా అటు ఇటూ మార్చుకున్నట్లు ఆ మహిళ తెలిపింది. కొంతకాలం గడిచిన తర్వాత తన ఫోటోలను తనకే పంపి తన ఆర్థిక డిమాండ్లకు ఒప్పుకోకపోతే తన ఫోటోలను బహిరంగంగా అందరికి చూపి అల్లరి చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. దీనికి భయపడిన తానూ ఒక సంవత్సరం పాటు ప్రతినెల 500 రియల్ ఒమాన్ డబ్బును అమ్మాయి పేరుతో ఉన్న నిందితునికి చెల్లించినట్లు వాపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి తనకు మరింత డబ్బు అవసరమని ఆ డబ్బు కోసం మరింత డిమాండ్ చేస్తున్నట్లు బాధితురాలు పోలీసుల వద్ద చెప్పింది. చెప్పారు. "ఆమె మరింత డబ్బును చెల్లించకపోతే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సివస్తుందని ఆ మహిళ బెదిరిపోయింది. " సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుండి స్నేహపూర్వక అభ్యర్థనలకు లొంగి వారిని ఆమోదించినప్పుడు ఇటువంటి ఇబ్బందులు తప్పవని సామాజిక మాధ్యమ వినియోగదారులను పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు..
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







