నిన్ను కోరి: మూవీ రివ్యూ

- July 07, 2017 , by Maagulf
నిన్ను కోరి: మూవీ రివ్యూ

రివ్యూ:  నిన్ను కోరి 
నటీనటులు : నాని, ఆది పినిశెట్టి, నివేథా థామస్, మురళీ శర్మ, పృధ్వీ, విద్యుల్లేఖా రామన్, తనికెళ్ళ భరణి తదితరులు 
సంగీతం: గోపీ సుందర్ 
కధనం, మాటలు: కోన వెంకట్ 
నిర్మాత : డి.వి.వి. దానయ్య 
రచన, దర్శకత్వం : శివ నిర్వాణ 
విడుదల తేదీ : జూలై 7, 2017 

విభిన్నమైన కథలు, కథనాలతో వరస విజయాలు సాధిస్తున్నాడు నాని. అదే విభిన్నకథాశంతో నిన్నుకోరిని ప్రేక్షకులముందుకు తెచ్చాడు. నాని తో నివేథా థామస్, ఆది పినిశెట్టి జతకలసి ఒక సెన్సిబుల్ లవ్ స్టోరిని ప్రజెంట్ చేసారు.. మరి నిన్నుకోరి సినిమాను ప్రేక్షకులకు ఎంత వరకూ కోరుకుంటారో తెలుసుకుందాం..

కథ :
ఆంధ్రా యూనివర్సిటీలో పి. హెచ్ .డి స్టూడెంట్ అయిన ఉమా మహేశ్వరరావు(నాని) కి నా అన్నవారేవరూ ఉండరు. ప్రోఫెసర్ సహాయంతో చదువుకుంటున్న ఉమా జీవితంలోకి పల్లవి వస్తుంది. తానే జీవితం అనుకుంటన్న టైం లో ఒక సంఘటన పల్లవిని ఉమాను వేరు చేస్తుంది. తన తల్లిదండ్రులు చూసిన అరుణ్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఉమా జీవితం మారిపోతుంది. జీవితాన్ని వదిలేసి డిప్రషెన్ లో పడిపోతాడు. పల్లవి ఇష్టం లేనిపెళ్ళి చేసుకొని మనసు చంపుకొని జీవిస్తుందని ఉమా నమ్మకం. ఉమాని కొత్త జీవితం మొదలెట్టమని పల్లవి అడుగుతుంది. తనతో జీవితం మళ్లీ మొదలెట్టమని అడుగుతాడు ఉమా. తన అరుణ్ తో తన జీవితం సాఫీ గా సాగుతుందనే నమ్మకం కలిగించేందుకు ఉమాని కొన్ని రోజులు తమతో పాటు కలసి ఉండేందుకు పల్లవి తమ ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత వారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకున్నది అనేది మిగిలిన కథ..?

కథనం:
నాని సినిమా అంటే అది ఇంటిల్లపాది సినిమా అనుకునేంత ఇష్టం పెరిగింది. అందుకే ఫ్యాన్స్ ఇమేజ్ కంటే ఫ్యామిలీస్ లో ఇమేజ్ ఎక్కువ నానికి. ఆ ఇమేజ్ ని మరింత పెంచుతుంది ఉమా మహేశ్వరరావు క్యారెక్టర్.  ప్రతి గల్లిలోనూ కనిపించే క్యారెక్టర్ ఇది. ఇలాంటి పాత్రలు నానికి అలవాటే అయినా ఉమా మహేశ్వరరావు క్యారెక్టర్ మెప్పిస్తుంది. సినిమా మొదలయిన కొద్ది సేపటికే కథ లోని ట్విస్ట్ అర్దం అవుతుంది. అయితే కథలోని ఎంటర్ అయిన తర్వాత నాని తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేసాడు. వైజాగ్ ఎపిసోడ్ అంతా సరదాగా సాగిపోతుంది. పల్లవి ఇంటి వారితో జరిగే సన్నివేశాలు ఫన్ గా సాగుతాయి. కథలోని క్యారెక్టర్స్ తో కానీ... రాసుకున్న సన్నివేశాలతో కానీ దర్శకుడు ఎక్కడా కన్ ఫ్యూజ్ కాలేదు. ఒక సగటు మనిషి ఆలోచనలకు దగ్గరగా సాగే క్యారెక్టర్ లోని భావోద్వేగాలను నాని బాగా పండించాడు. 'లవ్ లో సెకండ్ ఛాన్స్ ఉండదు' అనుకునే అమ్మాయి నుండి లైఫ్ ఎప్పుడూ సెకెండ్ ఛాన్స్ ఇస్తుంది అనేంత వరకూ సాగే ప్రయాణాన్ని సున్నితంగా నడిపాడు దర్శకుడు. నివిథా థామస్ కూడా తన పాత్రకు ప్రాణం పోసింది. ప్రేమ ఎప్పుడూ ఒకరితో ఆగిపోదు అనే ఫిలాసిఫికల్ డైలాగ్స్ లో ఆమె నటనలో మెచ్యూరిటీ కనిపించింది. నిత్యామీనన్ తర్వాత అంత స్టాండెర్డ్ ఆర్టిస్ట్ తెలుగు పరిశ్రమలోకి వచ్చింది. ఇక సెకండాఫ్ ఒక ఛాలెంజ్ తో మొదలవుతుంది. ప్రేమను గెలిపించే ఆరాటం ఒకరిది అయితే జీవితం అంటే ఎంటో అర్ధం చెప్పే ప్రయత్నం మరొకరిది. ఇందులో ఎవరి దారిలో వారు కరెక్టే అయినా ప్రేమ ఎవరి నమ్మకం గెలుస్తుందనే పాయింట్ ని చాలా చక్కగా డీల్ చేసాడు దర్శకుడు శివ నిర్వాణ. ఒక  సెన్సిబుల్ దర్శకడు తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. రాసుకున్న ప్రతి పాత్ర కూడా ఉదాత్తగా తీర్చిదిద్దాడు దర్శకుడు. పెళ్ళి చేసాం కదా ఇప్పుడు చావయినా బతుకయినా అక్కడే అనే మాటలు చెప్పకుండా కూతురు ఎమన్నా ఇబ్బంది పడుతుందేమో.. కావాలంటే పెళ్ళిని వద్దనుకుందాం.. అనుకునే తండ్రిగా మురళీ శర్మ మెప్పించాడు. ఇక సెకండాఫ్ నాని టైమింగ్ కొన్ని సన్నివేశాలలో హ్యాుమర్ పండుతుంది. ఆది పినిశెట్టి కి ఈ క్యారెక్టర్ ఇది మంచి ఛేంజోవర్ అనుకోవాలి. సరైనోడు వంటి ఊరమాస్ క్యారెక్టర్ నుండి పూర్తి విభిన్నమైన క్యారెక్టర్ లో మెప్పించాడు. ఒక ఉదాత్తమైన పాత్రలో ఆది ఫ్యామిలీస్ కి దగ్గర అయ్యాడు. క్లైమాక్స్ సన్నివేశాలలో వచ్చే డైలాగ్స్ గొప్పగా అనిపించాయి. ‘లైఫ్ ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళదు మనతోనే ఉంటుంది.. మనం యాక్సెప్ట్ చేయగలిగితే’ వంటి మాటలు ఎప్పుటికీ గుర్తుండిపోతాయి.

చివరిగా:
జీవితాన్ని గెలిపించిన మనసున్న మనుషుల కథ. క్లైమాక్స్ తో మొదలైన కొత్త కథ తప్పకుండా సర్ ప్రైజ్ చేస్తుంది. మరో హిట్ నానిని కోరుకుంది.రివ్యూ:  నిన్ను కోరి నటీనటులు : నాని, ఆది పినిశెట్టి, నివేథా థామస్, మురళీ శర్మ, పృధ్వీ, విద్యుల్లేఖా రామన్, తనికెళ్ళ భరణి తదితరులు సంగీతం: గోపీ సుందర్ కధనం, మాటలు: కోన వెంకట్ నిర్మాత : డి.వి.వి. దానయ్య రచన, దర్శకత్వం : శివ నిర్వాణ విడుదల తేదీ : జూలై 7, 2017 విభిన్నమైన కథలు, కథనాలతో వరస విజయాలు సాధిస్తున్నాడు నాని. అదే విభిన్నకథాశంతో నిన్నుకోరిని ప్రేక్షకులముందుకు తెచ్చాడు. నాని తో నివేథా థామస్, ఆది పినిశెట్టి జతకలసి ఒక సెన్సిబుల్ లవ్ స్టోరిని ప్రజెంట్ చేసారు.. మరి నిన్నుకోరి సినిమాను ప్రేక్షకులకు ఎంత వరకూ కోరుకుంటారో తెలుసుకుందాం.. కథ : ఆంధ్రా యూనివర్సిటీలో పి. హెచ్ .డి స్టూడెంట్ అయిన ఉమా మహేశ్వరరావు(నాని) కి నా అన్నవారేవరూ ఉండరు. ప్రోఫెసర్ సహాయంతో చదువుకుంటున్న ఉమా జీవితంలోకి పల్లవి వస్తుంది. తానే జీవితం అనుకుంటన్న టైం లో ఒక సంఘటన పల్లవిని ఉమాను వేరు చేస్తుంది. తన తల్లిదండ్రులు చూసిన అరుణ్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఉమా జీవితం మారిపోతుంది. జీవితాన్ని వదిలేసి డిప్రషెన్ లో పడిపోతాడు. పల్లవి ఇష్టం లేనిపెళ్ళి చేసుకొని మనసు చంపుకొని జీవిస్తుందని ఉమా నమ్మకం. ఉమాని కొత్త జీవితం మొదలెట్టమని పల్లవి అడుగుతుంది. తనతో జీవితం మళ్లీ మొదలెట్టమని అడుగుతాడు ఉమా. తన అరుణ్ తో తన జీవితం సాఫీ గా సాగుతుందనే నమ్మకం కలిగించేందుకు ఉమాని కొన్ని రోజులు తమతో పాటు కలసి ఉండేందుకు పల్లవి తమ ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత వారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకున్నది అనేది మిగిలిన కథ..? కథనం: నాని సినిమా అంటే అది ఇంటిల్లపాది సినిమా అనుకునేంత ఇష్టం పెరిగింది. అందుకే ఫ్యాన్స్ ఇమేజ్ కంటే ఫ్యామిలీస్ లో ఇమేజ్ ఎక్కువ నానికి. ఆ ఇమేజ్ ని మరింత పెంచుతుంది ఉమా మహేశ్వరరావు క్యారెక్టర్.  ప్రతి గల్లిలోనూ కనిపించే క్యారెక్టర్ ఇది. ఇలాంటి పాత్రలు నానికి అలవాటే అయినా ఉమా మహేశ్వరరావు క్యారెక్టర్ మెప్పిస్తుంది. సినిమా మొదలయిన కొద్ది సేపటికే కథ లోని ట్విస్ట్ అర్దం అవుతుంది. అయితే కథలోని ఎంటర్ అయిన తర్వాత నాని తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేసాడు. వైజాగ్ ఎపిసోడ్ అంతా సరదాగా సాగిపోతుంది. పల్లవి ఇంటి వారితో జరిగే సన్నివేశాలు ఫన్ గా సాగుతాయి. కథలోని క్యారెక్టర్స్ తో కానీ... రాసుకున్న సన్నివేశాలతో కానీ దర్శకుడు ఎక్కడా కన్ ఫ్యూజ్ కాలేదు. ఒక సగటు మనిషి ఆలోచనలకు దగ్గరగా సాగే క్యారెక్టర్ లోని భావోద్వేగాలను నాని బాగా పండించాడు. 'లవ్ లో సెకండ్ ఛాన్స్ ఉండదు' అనుకునే అమ్మాయి నుండి లైఫ్ ఎప్పుడూ సెకెండ్ ఛాన్స్ ఇస్తుంది అనేంత వరకూ సాగే ప్రయాణాన్ని సున్నితంగా నడిపాడు దర్శకుడు. నివిథా థామస్ కూడా తన పాత్రకు ప్రాణం పోసింది. ప్రేమ ఎప్పుడూ ఒకరితో ఆగిపోదు అనే ఫిలాసిఫికల్ డైలాగ్స్ లో ఆమె నటనలో మెచ్యూరిటీ కనిపించింది. నిత్యామీనన్ తర్వాత అంత స్టాండెర్డ్ ఆర్టిస్ట్ తెలుగు పరిశ్రమలోకి వచ్చింది. ఇక సెకండాఫ్ ఒక ఛాలెంజ్ తో మొదలవుతుంది. ప్రేమను గెలిపించే ఆరాటం ఒకరిది అయితే జీవితం అంటే ఎంటో అర్ధం చెప్పే ప్రయత్నం మరొకరిది. ఇందులో ఎవరి దారిలో వారు కరెక్టే అయినా ప్రేమ ఎవరి నమ్మకం గెలుస్తుందనే పాయింట్ ని చాలా చక్కగా డీల్ చేసాడు దర్శకుడు శివ నిర్వాణ. ఒక  సెన్సిబుల్ దర్శకడు తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. రాసుకున్న ప్రతి పాత్ర కూడా ఉదాత్తగా తీర్చిదిద్దాడు దర్శకుడు. పెళ్ళి చేసాం కదా ఇప్పుడు చావయినా బతుకయినా అక్కడే అనే మాటలు చెప్పకుండా కూతురు ఎమన్నా ఇబ్బంది పడుతుందేమో.. కావాలంటే పెళ్ళిని వద్దనుకుందాం.. అనుకునే తండ్రిగా మురళీ శర్మ మెప్పించాడు. ఇక సెకండాఫ్ నాని టైమింగ్ కొన్ని సన్నివేశాలలో హ్యాుమర్ పండుతుంది. ఆది పినిశెట్టి కి ఈ క్యారెక్టర్ ఇది మంచి ఛేంజోవర్ అనుకోవాలి. సరైనోడు వంటి ఊరమాస్ క్యారెక్టర్ నుండి పూర్తి విభిన్నమైన క్యారెక్టర్ లో మెప్పించాడు. ఒక ఉదాత్తమైన పాత్రలో ఆది ఫ్యామిలీస్ కి దగ్గర అయ్యాడు. క్లైమాక్స్ సన్నివేశాలలో వచ్చే డైలాగ్స్ గొప్పగా అనిపించాయి. ‘లైఫ్ ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళదు మనతోనే ఉంటుంది.. మనం యాక్సెప్ట్ చేయగలిగితే’ వంటి మాటలు ఎప్పుటికీ గుర్తుండిపోతాయి. చివరిగా: జీవితాన్ని గెలిపించిన మనసున్న మనుషుల కథ. క్లైమాక్స్ తో మొదలైన కొత్త కథ తప్పకుండా సర్ ప్రైజ్ చేస్తుంది. మరో హిట్ నానిని కోరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com