ముహరక్ పర్యాటక రంగ అభివృద్ధికి ఉచిత వై-ఫై

- October 17, 2015 , by Maagulf
ముహరక్ పర్యాటక రంగ అభివృద్ధికి ఉచిత వై-ఫై

చారిత్రక కాలంలో బహ్రైన్ రాజధానిగా ఉండిన ముహరక్ ను పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అక్కడి ముఖ్య ప్రదేశాలలో ఉచిత వైర్ లెస్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. బహ్రైన్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్, పాత ముహరక్ సక్, ఇక్కడి పురాతన మరియు చారిత్రాత్మక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, తోటలు మరియు నడక దారుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. త్వరలో తీర ప్రాంతాల్లో కూడా ఈ సౌకర్యాన్ని అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులు ఇంటర్నెట్‌పై రోమింగ్ పడుతున్నందువల్ల దానిని ఆపివేస్తున్నారని, ఈ సౌకర్యం ఇపుడు ఉచితంగా అందుబాటులోకి రావడం వారందరికీ చాలా సౌలభ్య మయ్యే విషయమని, కౌన్సిల్ ఛైర్మన్ మొహమ్మెద్ అల్ సినాన్ అభిప్రాయపడ్డారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com