క్రైమ్ స్టేట్స్ గా మారుతున్న తెలుగు రాష్ట్రాలు
- July 09, 2017
తెలుగు రాష్ట్రాలు.. నేర రాష్ట్రాలుగా మారుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలతో ఘోషిస్తున్నాయి. ప్రేమోన్మాది వీరంగం ఓచోట.. పసిపాపపై అత్యాచారం మరోచోట.. సైకోల హల్‌చల్ ఇంకోచోట. ఇలా శనివారం ఒక్కరోజే జరిగిన పలు ఘటనలు జనాల్లో పెరుగుతున్న నేర ప్రవర్తనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అనుమానం పెనుభూతమై.. ప్రేమికుడిని ఉన్మాదిగా మార్చింది. వైజాగ్, పూర్ణా మార్కెట్ సమీపంలోని పండా వీధిలో ఉండే భవానీ, సతీష్‌లు రెండేళ్లుగా ప్రేమికులు. నర్స్ ట్రైనింగ్ కోసం రాజమండ్రి వెళ్లిన భవానీపై అనుమానం పెంచుకున్న సతీష్.. ఆమెను హతమార్చాడు. భవానీని గొంతుకోసి.. డంబెల్‌తో బాది.. అతి దారుణంగా చంపేశాడు.. భవానీని అమానుషంగా హతమార్చిన ప్రేమోన్మాదిపై స్థానికులు విరుచుకుపడ్డారు. అతనిపై మూకుమ్మడిగా దాడి చేసి కొట్టడంతో సతీష్ తీవ్రంగా గాయపడ్డాడు. మద్యం మత్తులో భార్యను కడతేర్చాడు ఓ భర్త. అల్లుడి ఆగడాన్ని అడ్డుకోబోయినా అత్తనూ చితకబాదాడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. విశాఖ గాజువాకలో జరిగిందీ దారుణం.. విజయనగరం జిల్లాలో పదహారేళ్ల బాలుడు కామాంధుడిగా మారాడు. మూడేళ్ల పాపపై పాశవికంగా అత్యాచారం చేశాడు. సాలూరు మండలం నెవిపర్తికి చెందిన ఆ చిన్నారి ఏడుస్తూ విషయం ఇంట్లో చెప్పడంతో విషయం వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి.. తనూ ఆత్మహత్య చేసుకుంది. టేకులపల్లి మండలం కోయగూడెంలో ఈ దుర్ఘటన జరిగింది. భర్త జంపయ్య వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య మీనా.. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. తణుకులో.. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది ఓ మహిళ. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న కోటేశ్వరీ.. కుటుంబ పోషణ భారంగా మారడంతో పదేళ్ల కూతురు భార్గవి, ఏడేళ్ల కొడుకు సంతోష్ కు పురుగుల మందు తాగించి, ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఒంగోలు సమ్మర్ స్టోరేజీలో దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. అద్దంకి కి చెందిన సుప్రియ.. ప్రేమికుడితో గొడవ పడి ఆవేశంలో చెరువులోకి దూకేసింది. ఆమెను కాపాడేందుకు ప్రియుడు కూడా నీటిలోకి దూకాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు ప్రేమికులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పట్టపగలు దారుణ హత్య జరిగింది. స్వామి అనే యువకుణ్ని గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై నరికి చంపడం కలకలం సృష్టించింది. కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై ఓ మహిళ బైఠాయించి ఆందోళన చేపట్టడం కలకలం సృష్టించింది. భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈ విధంగా నిరసన వ్యక్తం చేసింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో మతిస్థిమితం లేని ఓ యువకుడు కాసేపు హంగామా చేశాడు. కత్తి పట్టుకుని.. తనకు రైల్వేకి సంబంధించి అన్ని వివరాలు కావాలంటూ హంగామా చేశాడు. గదిలోకి ఎవరైనా వస్తే.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. తిరుమలలో సైకో హల్ చల్ చేశాడు. బాలానగర్ మొదటి లైన్‌లోని ఇళ్లలోకి చొరబడి వీరంగం స్పష్టించాడు. స్థానికులు సైకోకు దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







