తెలుగు యువతికి సౌదీ నుంచి విముక్తి

- July 09, 2017 , by Maagulf
తెలుగు యువతికి సౌదీ నుంచి విముక్తి

ఏజెంట్ల మోసానికి గురై గల్ఫ్‌లో చిక్కుకున్న ఒక హైదరాబాద్ యువతికి విముక్తి లభించింది. మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పడంతో సనత్ నగర్‌కు చెందిన షబానా బేగం 9 నెలల క్రితం గల్ఫ్ వెళ్లింది. కానీ అక్కడ చాలీచాలని జీతంతో చాకిరి చేస్తూ కష్టపడింది. తిరిగి హైదరాబాద్‌ వద్దామంటే డబ్బుల్లేక ఇబ్బంది పడింది. విషయం తెలిసిన గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు ఇండియన్ ఏంబసీ సాయంతో బాధితురాలిని హైదరాబాద్ చేర్చారు. శంషాబాద్ ఏర్‌పోర్ట్ చేరుకోగానే.. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులను చూసి బాధితురాలు కన్నీళ్లు పెట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com