యూఏఈలో రెసిడెన్సీ పర్మిట్‌ ప్రాసెసింగ్‌ టైమ్‌ సగానికి తగ్గింపు

- July 09, 2017 , by Maagulf
యూఏఈలో రెసిడెన్సీ పర్మిట్‌ ప్రాసెసింగ్‌ టైమ్‌ సగానికి తగ్గింపు

మినిస్ట్రీస్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌, ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌, హెల్త్‌ అండ్‌ ప్రివెన్షన్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మరియు ఎమిరటైజేషన్‌ మరియు ఎమిరేట్స్‌ ఐడెంటిటీ అథారిటీ, రెసిడెన్సీ పర్మిట్‌ ప్రాసెసింగ్‌ టైమ్‌ని సగానికి తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ప్రంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ యాక్సెలెటేర్‌ని ఏర్పాటు దిశగా సరికొత్త ప్రభుత్వ అప్రోచ్‌ నేపథ్యంలో ఈ చర్యలను చేపట్టడం జరిగింది. యూఏఈ విజన్‌ 2021లో భాగంగా ఈ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. దుబాయ్‌ రూలర్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైఎస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, లక్ష్యాలను మరింత వేగంగా అందుకునే దిశగా చేపట్టిన కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. ప్రభుత్వ శాఖలన్నీ జాయింట్‌ ప్రాజెక్టుల్ని రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు మరింత సంయమనంతో వ్యవహరించనున్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ - హెల్త్‌ సెంటర్స్‌ అండ్‌ క్లినిక్స్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ హుస్సేన్‌ అల్‌ రన్‌ద్‌ మాట్లాడుతూ, మినిస్ట్రీ హ్యాపినెస్‌ స్టేషన్‌ని అజ్మాన్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ సెంటర్‌లో భాగస్వాములతో కలిసి ఏర్పాటు చేశామనీ, రెసిడెన్సీ పర్మిట్స్‌ని ఇష్యూ చేయడానికి తగిన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. 100 రోజుల్లోనే ప్రైవేట్‌ సెక్టార్‌ స్టాఫ్‌కి రెసిడెన్సీ పర్మిట్‌ని మంజూరు చేయగలుగుతామని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com