జెడ్డా సమ్మర్ ఫెస్టివల్ ఈ ఏడాది 1 మిలియన్ల సందర్శకులను ఆకర్షించవచ్చు
- July 10, 2017
ఆదివారం ( నిన్న ) నుంచి మొదలైన జెడ్డా సమ్మర్ ఫెస్టివల్ కు ఈ ఏడాది 1 మిలియన్ కంటే ఎక్కువ మంది సందర్శకులు హాజరుకావచ్చోని నిర్వాహకులు పేర్కొన్నారు. నిన్న (ఆదివారం) జూలై 9 వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవం ఒక నెలరోజులపాటు కొనసాగనుంది. ఆల్-హరమైన్ రహదారిలో ఉన్న మార్సల్ గ్రామంలో జంగిల్ ల్యాండ్ థీమ్ పార్కులో నిర్వహించబడుతుంది. జెడ్డా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ మాజెన్ బిన్ మొహమ్మద్ బ్యాటర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజుకు 50,000 మంది సందర్శకులు ఇక్కడకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఈ సంవత్సరం, పండుగ యొక్క కొత్త ఒరవడి ఉందని వేసవి సెలవులలో కల్సి వచ్చే అతి పెద్ద ఉత్సవం అని కలిసి జెడ్డా లో అతిపెద్ద పర్యాటక మరియు మార్కెటింగ్ వార్షిక కార్యక్రమమని ఆయన అన్నారు. పర్యాటక రంగం అనేది ఒక ముఖ్యమైన మూల స్థంభం అని ఇది దేశ ఆదాయ వనరులను విస్తరించడానికి దోహదం చేస్తుంది మరియు స్థానికంగా, ప్రాంతీయంగా పర్యాటక సూచికలో లో జెడ్డా యొక్క హోదాను పెంచుతుందని ఆయన వివరించాడు.ఈ పండుగలో పర్యాటక రంగం, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు, క్రీడలు, దృశ్య ప్రదర్శనలు, పిల్లల మరియు కుటుంబాల కోసం నాటకాలు, జానపద ప్రదర్శనలు మరియు నృత్యం, సౌదీ అరేబియా సొసైటీ ఫర్ కల్చర్ అండ్ ఆర్ట్స్ నిర్వహించిన ఒక చైనీస్ సర్కస్ మరియు సాంస్కృతిక నాటకాలు ఈ సంవత్సరం పండుగలో వందల ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి. మరియు ఇక్కడ షాపింగ్ చేయడం ద్వారా అదనంగా వేలాది బహుమతులను పర్యాటకులకు అందజేస్తుంది అని జెడ్డా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క సెక్రటరీ జనరల్ హస్సన్ బిన్ ఇబ్రహీం దహ్లన్ చెప్పారు. షాపింగ్ చేసేవారు కోసం నాలుగు లగ్జరీ కార్లు సహా, 2 మిలియన్ సౌదీ రియాళ్ళు ( 533,305 డాలర్ల) బహుమతులు వేచి ఉన్నాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







