50 మంది అమర్నాధ్ యాత్రికులను కాపాడిన సలీమ్
- July 11, 2017
పవిత్ర అమర్నాథ్ యాత్ర చేస్తున్న యాత్రికులను కూడా ఉగ్రవాదులు విడిచిపెట్టట్లేదు. వారిని కూడా లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి తమ క్రూరత్వాన్ని చాటుకుంటున్నారు. అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని తిరిగి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా బస్సుపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసింది. అనుకోని ఈ సంఘటనకు షాక్ తిన్న డ్రైవర్ వెంటనే తేరుకుని కిలోమీటర్ దూరం వరకు పోనిచ్చాడు. దీంతో 50 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతనాగ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చికిత్స పొందుతున్న భాగ్యమణి ఆ భయానక సంఘటన జరిగిన తీరును వివరించారు. ఈ ఘటనలో తన బంధువు నిర్మల ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరుపుతున్నావెరవకుండా కిలో మీటరు వరకు అలానే ప్రయాణించి 50 మంది ప్రాణాలను కాపాడిన డ్రైవర్ సలీమ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









