ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత మంగేశ్ తెందుల్కర్ కన్నుమూత

- July 11, 2017 , by Maagulf
ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత మంగేశ్ తెందుల్కర్ కన్నుమూత

ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత మంగేశ్ తెందుల్కర్(82) కన్నుమూశారు. మంగేశ్ గత ఆదివారం అనారోగ్యానికి గురి కావడంతో పుణెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
82ఏళ్ల మంగేశ్ తన చివరి రోజుల వరకు కార్టూన్లు వేస్తూనే గడిపారు.ఆయన కార్టూన్లలోని కొన్నింటిని గత నెల్లో పుణెలో ప్రదర్శనకు ఉంచారు. మంగేశ్ సామాజిక కార్యకర్త కూడా. తన కార్టూన్లు, కారికేచర్లతో ప్రజల్లో ట్రాఫిక్ సమస్యలపై అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పోస్టుకార్డులపై సందేశంగా రాసి.. వాటిని తానే స్వయంగా సిగ్నల్స్ వద్ద నిలబడి వాహనదారులకు పంచేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కార్టూన్లే కాకుండా మంగేశ్ రాసిన అనేక వ్యాసాలు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com