ఎయిర్ఏసియా విమానానికి తప్పిన ప్రమాదం
- July 11, 2017
ఎయిర్ఏసియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రాంచీ ఎయిర్పోర్టులో విమానం మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ఓ ప్రయాణికుడు ఎగ్జిట్ డోర్ తీశాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా ఎయిర్పోర్టులో విమానం రన్వేపైకి దిగేందుకు వస్తుండగా.. ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా లేచి విమానం నుంచి బయటకు వెళ్లే డోర్ తెరిచాడు. అయితే అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే విమానం ఎక్కడి నుంచి వస్తుంది, అందులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. విమానం ల్యాండ్ అయ్యాక.. సదరు ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









