మేరీ ల్యాండ్ లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
- July 11, 2017
అమెరికాలోని మేరీ ల్యాండ్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా మేరీ ల్యాండ్లోని ఎన్ఆర్ఐలందరూ ఒకేచోట చేరి వైఎస్సార్ 68వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వచ్చిన పెద్దలు మేరిల్యాండ్లోని ఎన్ఆర్ఐలకు వైఎస్సార్ పాలనని, ఆయన మడమ తిప్పని ఔన్నత్యాన్ని బడుగు, బలహీన, కార్మిక, శ్రామిక, రైతు వర్గాలకు ఆయన చేసిన మంచిపనులను వివరించారు.
అనంతరం వైఎస్సార్ జయంతి సందర్భంగా హోవార్డ్ కౌంటీ ఫుడ్ బ్యాంక్ కి భారీ స్థాయిలో ఆహారాన్ని వితరణగా ఇచ్చారు. వైఎస్సార్ మరణించినా ఆయన ఆశయాలను అమలు పరచే విధంగా తమ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని మేరీల్యాండ్ వైస్సార్ అభిమానులు ప్రతిఙ్ఞ చేశారు. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మేరీ ల్యాండ్లో మరిన్ని చేసి తమ ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఖ్యాతిని వ్యాప్తి చెందేలా కృషి చేస్తామన్నారు. రాజన్న ఆశయాలు కొనసాగించే ధైర్యం వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. 2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై నిలిపేందుకు తమ సహకారం ఎప్పుడు అందించడానికి సిద్ధమని మేరీల్యాండ్లోని ఎన్ఆర్ఐలు తెలిపారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







