అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం కూలి 16 మంది మృతి

- July 11, 2017 , by Maagulf
అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం కూలి 16 మంది మృతి

అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం మిస్సిస్సిపీ ప్రాంతంలో కుప్పుకూలింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఈ ప్రమాదాన్ని అమెరికా నావికాదళం ధ్రువీకరించింది. అయితే ఈ విమానంలో16 మంది సైనికులు మరణించరాని  దేశ పౌరులు ఎవరైన ఉన్నారనే విషయం తెలియదని మెరైన్స్‌ డైరెక్టర్‌ ఫ్రాంక్‌ రాండల్‌ తెలిపారు.
ఈ ఘటన సోమవారం సాయంత్రం సంభవించిందని,  ఇది లెఫ్లోర్‌లోని కౌంటీ తీరప్రాంత గస్తీదళానికి చెందిన కేసీ-130 రవాణ విమానమని యూఎస్‌ మెరైన్స్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. ఈ విమానాన్ని ఇంధన రవాణా కోసం వినియోగిస్తున్నారు. ఈ ఘటనలో విమానం పూర్తిగా కాలిపోగా ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 12 మృతదేహాలను గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com