విద్యుత్ షాక్ తో కేరళావాసి కువైట్లో మృతి

- July 11, 2017 , by Maagulf
విద్యుత్ షాక్ తో  కేరళావాసి  కువైట్లో మృతి

కువైట్ : తన కార్యాలయంలో డ్రిల్లింగ్ మెషిన్ తో పనిచేసుకొంటున్న ఓ ప్రవాసీయ భారతీయునికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ కొట్టడంతో గుండె ఆగి మరణించాడు. దక్షణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఈ   మలయాళీ వ్యక్తి పేరు బిజూజార్జి (38) గా గుర్తించారు. కేరళ లోని పతనందిట్ట జిల్లా లోని జార్జ్ , చిన్నమ్మ దంపతుల కుమారుడైన బిజూజార్జి కువైట్ లోని  ప్రిస్మా అల్యూమినియం ఫాబ్రికేషన్ కంపెనీలో ఒక ఉద్యోగి గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక డ్రిల్లింగ్ మెషిన్ నుండి విద్యుత్ బిజూ జార్జి శరీరంలోనికి ఒక్కసారిగా ప్రవహించడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే బిజును ముబారకియా ఆసుపత్రికి తీసుకువెళ్ళారు, కాని విద్యుత్ షాక్ సోకడంతో గుండె అకస్మాత్తుగా ఆగిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. బిజూ జార్జి  భార్య టెస్సిమోల్ హవాలీలోని ఒక ప్రైవేటు క్లినిక్ లో ఒక నర్సుగా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు మూడేళ్ళ అల్బిన్ మరియు ఇటీవల జన్మించిన నెలల వయస్సు గల ఇమిలిన్ ఉన్నారు.బిజూజార్జి కుటుంబం సెలవులు గడిపేందుకు ఇటీవల కేరళ వెళ్ళింది.జరిగిన ఈ విషాదంతో వారు కువైట్ తిరిగి రావాల్సి ఉంది. బిజూజార్జి భౌతికకాయంను డాజీజ్ మార్చురీ లో భద్రపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com