ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతం

- July 12, 2017 , by Maagulf
ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతం

అబు బకర్ అల్ బాగ్దాదీ హతమయ్యాడని ఎట్టకేలకు ఐసిస్ ఒప్పుకుంది. సిరియాలోని రక్కా కేంద్రంగా తీవ్రవాద సామాజ్యాన్ని విస్తరించిన బాగ్దాదీ, కొద్ది వారాల  కిందట రష్యా దళాలు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్టు నిర్థారిస్తోంది. త్వరలోనే ఐసిస్ కొత్త చీఫ్ ఎవరన్న దానిపై ప్రకటన చేయబోతోంది. 2011 నుంచే మోస్ట్‌వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు బాగ్దాదీ. అతని ఆచూకి చెప్పిన వారికి మిలియన్ పౌండ్ల నజరానా కూడా ప్రకటించారు. 2015లోనే అమెరికా జరిపిన దాడుల్లో అతను చనిపోయినట్టు 
వార్తలొచ్చాయి.  ఆ తర్వాత కూడా పలుమార్లు బాగ్దాదీ మరణంపై ఇలాంటి కథనాలే వినిపించాయి. కానీ ఇప్పుడు అతను హతమైనట్టు ఐసిస్ ఒప్పుకుందని సిరియా మానవహక్కుల సంఘం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com