దాదాసాహేబ్ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించిన ఏపీ ప్రభుత్వం
- July 12, 2017
ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్‌ను ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి విశ్వనాథ్ అని, ఆయన్ను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశ్వనాథ్ జాతి సంపద అన్నారు. భాషను కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీదా ఉందన్నారు. ప్రపంచమంతా కూచిపూడికి పేరుందని, దాన్ని మర్చిపోకుండా ఈ ఏడాది 60 వేల మందికి నేర్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని కె.విశ్వనాథ్ నిరూపించారని కొనియాడారు. ఇది అసామాన్యమైన అవార్డు అని దర్శకులు కె.విశ్వనాథ్ అన్నారు. ఈ అవార్డు వచ్చినా కళ్లు నెత్తిన ఎక్కకూడదని దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. అవార్డులు శాశ్వతం కాదని చెప్పారు. కష్టపడి పని చేస్తే దేవుడు ఆలస్యం చేస్తాడేమో గానీ, అన్యాయం చేయడన్న నమ్మకం ఉందన్నారు. సినిమా అనే ఆయుధంతోనే ఇక్కడి వరకు రాగలిగానని విశ్వనాథ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







