ఖ్ఆతిఫ్ దాడుల్లో భద్రతా దళానికి చెందిన వ్యక్తి మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు
- July 12, 2017
ఆదివారం సాయంత్రం ఖ్ఆతిఫ్ జరిగిన కాల్పుల సంఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. తూర్పు ప్రాంతంలోని ఒక పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ మరో ఘటనలో ఆవామియాలో ఇద్దరు పౌరులకు ఆదివారం మధ్యాహ్నం బుల్లెట్ గాయాలు తగిలాయని తెలిపాడు. పోలీసుల ప్రతినిధి మాట్లాడుతూ, కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో భద్రతా సిబ్బంది ఒకరు కాల్పుల్లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థిరంగా ఉందని పేర్కొన్నారు. రెండు వేర్వేరు సంఘటనల్లో 50 ఏళ్ల వయస్సు మరియు 30 ఏళ్ల వయస్సు గల పౌరులు గాయపడ్డారు. గుర్తు తెలియని నిందితులు జరిపిన తుపాకులు కాల్పులు వీరంతా గాయపడినట్లు ఆయన తెలిపారు. వీరు ఖ్ఆతిఫ్ సెంట్రల్ ఆసుపత్రిలో చేర్చబడ్డారు. ఖ్ఆతిఫ్ గవర్నరేట్లోని పోలీసులు ఈ రెండు సంఘటనలపై నేర విచారణను ప్రారంభించారు. శనివారం, రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ ఒక ప్రకటనలో రాజ్య భద్రతను ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాడు. కింగ్డమ్ యొక్క స్థిరత్వాన్ని మరియు దేశ భద్రతపై. ఇది అమరవీరుల సార్జెంట్ అడెల్ బిన్ ఫలాహ్ బిన్ అయ్యద్ అల్-ఓటిబి మరియు కార్పోరల్ అబ్దుల్లా టర్కీ అల్-టి ఖతిఫ్ లోని అల్-ముసావ్వా జిల్లాలో భద్రతా నిర్వహణలో తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న సమయంలో మరణించిన ఇద్దరు భద్రతా దళ సిబ్బందికి ఆయన నివాళులు అర్పించారు. నాడు వారు గస్తీ సమయంలో నడుపుతున్న కారు తీవ్రవాద దాడికి గురైంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







