ఇంటికి నిప్పు: నిందితుడికి మూడేళ్ళ జైలు

- July 12, 2017 , by Maagulf
ఇంటికి నిప్పు:  నిందితుడికి మూడేళ్ళ జైలు

ఓ మహిళ ఇంటిని, కారుని తగలబెట్టిన కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అగ్ని ప్రమాదం కారణంగా 2000 బహ్రెయినీ దినార్స్‌ నష్టం వాటిల్లింది. 20 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, బాధితురాలి ఇంట్లోని పెట్‌ బర్డ్స్‌ని దొంగిలించే క్రమంలో విఫలమై, అసహనంతో ఆ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో నిందితుడికి మరో వ్యక్తి కూడా సహకరించాడు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నదీ తెలియరాలేదు. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు ఇంట్లో లేరు. పక్షుల్ని దొంగిలించేందుకోసం ఫెన్సింగ్‌ ద్వారా ఇంట్లోకి ప్రవేశించామనీ, అయితే అక్కడ కేజ్‌లో పక్షులేమీ లేకపోవడంతో నిప్పు పెట్టాననీ, వెళుతూ వెళుతూ సీసీటీవీ కెమెరాని ధ్వంసం చేశామని నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిపై గతంలో 31 కేసులున్నాయి. ఆ కేసుల్లో 20 ఏళ్ళ జైలు శిక్ష కూడా పడింది నిందితుడికి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com