పడవ నుండి నల్గురు మత్స్యకారులను రక్షించిన రాయల్ నేవీ ఆఫ్ ఒమన్

- July 13, 2017 , by Maagulf
పడవ నుండి నల్గురు మత్స్యకారులను రక్షించిన రాయల్ నేవీ ఆఫ్ ఒమన్

మస్కట్: " సారంగు మరణం ..సముద్రం పాలే  " అని గతంలో ఓ సామెత ఉండేది...ఈ రోజు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం నడి సముద్రంలో ఉన్నప్పటికీ రక్షించబడుతున్నారు. ఈ వార్త అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ.నల్గురు మత్స్యకారులతో సోహార్ ఓడరేవుకు సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ పడవ బలమైన కెరటాల ధాటికి అకస్మాత్తుగా విరిగిపోవడంతో ప్రమాదానికి గురైంది.ఈ పడవ సోహార్ ఓడరేవుకు ఈశాన్య దిశలో 54 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. సమాచారం అందుకొన్న రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ ఆపరేషన్స్ సెంటర్ సమన్వయంతో మారిటైమ్ సెక్యూరిటీ తమ నౌకాదళ ఓడ ద్వారా అక్కడకు చేరుకొని ఆ నల్గురు జాలర్లను రక్షించారు. ప్రస్తుతం ఆ సముద్ర పుత్రులు  జాలర్లు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో క్షేమంగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com