ఇస్రో సెంటర్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- July 14, 2017
భారత అంతరిక్ష పరిశోదన సంస్ధ (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో).. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో సెంటర్లు/యూనిట్లు/అటానమస్ ఇనిస్టిట్యూషన్లు/అంతరిక్ష విభాగం పరిధిలోని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ల (సీపీఎస్‌యూ) లో అసిస్టెంట్లు, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల (అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్)భర్తీకి ప్రకటన జారీ చేసింది.
ఖాళీలు: అసిస్టెంట్లు:311, యూడీసీ:2.
జోన్ల వారీగా అసిస్టెంట్ల వేకెన్సీ: అహ్మదాబాద్: 36, బెంగళూరు: 104, హైదరాబాద్: 28, న్యూఢిల్లీ : 18, శ్రీహరికోట : 35, తిరువనంతపురం: 90.
వేతనం: నెలకు రు.25,000. అలవెన్సులు అదనం.
అర్హత: 2017 జులై 31 నాటికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ (ఆర్ట్స్/కామర్స్/మేనేజ్మెంట్/సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్)తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు:2017 జులై 31 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ మార్కుల ఆధారంగా స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ మార్కులను తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్ష మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, డెహ్రడూన్, గువాహటి, కోల్‌కతా, న్యూఢిల్లీ, తిరువనంతపురం.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి.
ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జులై 31, రాత పరీక్ష : అక్టోబర్ 15, 2017.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







