యువ దర్శకుడితో హీరో నాగార్జున

- July 14, 2017 , by Maagulf
యువ దర్శకుడితో హీరో నాగార్జున

 నా గార్జున త్వరలోనే 'రాజుగారి గది2'తో సందడి చేయబోతున్నారు. ఇంతలో ఆయన మరో కొత్త చిత్రానికి పచ్చజెండా వూపినట్టు తెలిసింది. తన సంస్థలో ఓ యువ కథానాయకుడితో సినిమా తీసి విజయాన్ని సొంతం చేసుకొన్న ఓ యువ దర్శకుడు నాగార్జునకి ఇటీవలే కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి అంగీకరించినట్టు తెలిసింది. నాగార్జున తన సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఒక సినిమా పూర్తయ్యేలోపుగానే, మరో సినిమాని పట్టాలెక్కిస్తుంటారు. అయితే ఇటీవల తన తనయుల చిత్రాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారాయన. దాంతో 'రాజుగారి గది2' చివరిదశకు వచ్చినా తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. చిత్రం మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొస్తుండడంతో ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌పై దృష్టి సారించినట్టు తెలిసింది. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో 'సోగ్గాడే చిన్నినాయనా'కి సీక్వెల్‌గా 'బంగార్రాజు' చిత్రం చేయాల్సి ఉన్నా, ఆ సినిమాకి సంబంధించి ఇంకా పక్కాగా స్క్రిప్టు సిద్ధం కాలేదు. అందుకే యువ దర్శకుడు చెప్పిన కథని విని నాగ్‌ ఓకే చెప్పేసినట్టు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com