ఏపీఎన్ఆర్టీ సదస్సులో పాల్గొనటానికి యూఏఈ విచ్చేసిన రవి వేమూరు
- July 15, 2017_1500104910.jpg)
'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై అవగాహన సదస్సు లో పాల్గొనుటకు రెండు రోజుల పర్యటన నిమిత్తం యుఏఈ విచ్చేసిన 'ఏపీఎన్ఆర్టీ' ప్రెసిడెంట్ డా||రవి కుమార్ వేమూరు కు దుబాయ్ విమానాశ్రయంలో యుఏఈ కోఆర్డినేటర్లు అనురాధ ఒబ్బిలిశెట్టి, శ్రీకాంత్ చిత్తర్వు, ముక్కు తులసి కుమార్ ఘన స్వాగతం పలికారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యి రవికుమార్ వేమూరు కు పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం కోఆర్డినేటర్లు మాట్లాడుతూ రవి కుమార్ పర్యటనా వివరాలు ఇలా తెలిపారు. "తొలుత దుబాయ్ లోని పలు లేబర్ క్యాంపులకు వెళ్లి అక్కడి కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని తగు సూచలనాలు వారికి అందించనున్నారు. తదుపరి దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో సమావేశమై అధికారులతో 'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై చర్చించనున్నారు. అటుపై స్థానిక ప్రముఖులతో సమావేశమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో పెట్టుబడులకై సుదీర్ఘంగా చర్చించనున్నారు".

తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







