మలయాళ నటుడు దిలీప్‌నకు బెయిల్‌ నిరాకరణ

- July 15, 2017 , by Maagulf
మలయాళ  నటుడు దిలీప్‌నకు బెయిల్‌ నిరాకరణ

ప్రముఖ మలయాళీ నటుడు దిలీప్‌కుమార్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆయనకు విధించిన పోలీస్‌ కస్టడీ ముగియడంతో పోలీసులు శనివారం అంగమలీ జ్యూడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం దిలీప్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టిపారేసింది. జులై 25 వరకూ జ్యూడిషియల్‌ కస్టడీకి అప్పగించింది.
మలయాళీ నటి భావన అపహరణ, లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దిలీప్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాను అమాయకుడినని, అనవసరంగా ఇరికించారని దిలీప్‌ ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భావనను కారులో అపహరించి, అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పెను సంచలనం సృష్టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com