'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై అవగాహన సదస్సు
- July 15, 2017
రెండు రోజుల పర్యటన నిమిత్తం యుఏఈ విచ్చేసిన 'ఏపీఎన్ఆర్టీ' ప్రెసిడెంట్ డా||రవి కుమార్ వేమూరు కు దుబాయ్ విమానాశ్రయంలో యుఏఈ కోఆర్డినేటర్లు అనురాధ ఒబ్బిలిశెట్టి, శ్రీకాంత్ చిత్తర్వు, ముక్కు తులసి కుమార్ ఘన స్వాగతం పలికారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యి రవికుమార్ వేమూరు కు పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం కోఆర్డినేటర్లు మాట్లాడుతూ రవి కుమార్ పర్యటనా వివరాలు ఇలా తెలిపారు. "తొలుత దుబాయ్ లోని పలు లేబర్ క్యాంపులకు వెళ్లి అక్కడి కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని తగు సూచలనాలు వారికి అందించనున్నారు. తదుపరి దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో సమావేశమై అధికారులతో 'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై చర్చించనున్నారు. అటుపై స్థానిక ప్రముఖులతో సమావేశమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో పెట్టుబడులకై సుదీర్ఘంగా చర్చించనున్నారు".
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







