విశాల హృదయం చాటుకున్న వరుణ్ సందేశ్ భార్య
- July 16, 2017
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య చిత్ర విచిత్రమైన వార్తలు వినాల్సి వస్తుంది. మొన్నటికి మొన్న హీరో వరుణ్ సందేష్ భార్య వితిక షేరూ ఆత్మహత్యా యత్నం చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే..నిన్నటి నుంచి టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వార్తలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక షేరూ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ...అయితే ఈ సారి మాత్రం వితికా చేసిన గొప్ప పనికోసం ఆమె వార్తల్లోకి ఎక్కారు.
తాను ఎంతగానో ఇష్టపడి పెంచుకొన్న జట్టును కొంతమేరకు క్యాన్సర్ బాధితులకు కోసం విరాళంగా ఇచ్చారు. తాను తల్చుకుంటే డబ్బు రూపంగానో..వస్తు రూపంగానో విరాళం ఇచ్చేది..కానీ తాను ఎంతో ఇష్టపడ్డ శిరోజాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఈ మద్య వితిక కొన్ని యాడ్స్ లో నటిస్తున్నాని చెప్పింది.
కానీ ఈ విషయంలో ఎలాంటి కమర్షియాల్ ఆలోచనలు లేకుండా నిండు మనసుతో తన శిరోజాలు కొన్ని క్యాన్సర్ బాధితులకు కోసం విరాళంగా ఇచ్చారు. సదుద్దేశంతో తల వెంట్రుకలను క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అధ్యార్(చెన్నై)కు విరాళంగా ఇచ్చానని పేర్కొన్నారు. గతంలో రేణుదేశాయ్, ఛార్మీ కూడా జట్టును విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









