ఎయిర్‌ఏసియా విమానానికి తృటిలో ప్రమాదం
- July 16, 2017
రాంచీ విమానాశ్రయంలో ఎయిర్‌ఏసియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో విమానంలో ఉన్న 174 ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాంచీ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఏసియా విమానం బిర్సాముండా ఎయిర్‌పోర్ట్ లో టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు.
అకస్మాత్తుగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడం వల్ల విమాన బ్లేడ్లు దెబ్బతిన్నాయి. వీటి చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. విమానంలోని ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా సిబ్బంది దింపివేశారు. విమానం కాస్త దెబ్బతిన్నా, ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
జూలై 12న రాంచీకి వెళ్తున్న ఎయిర్ ఆసియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. సిబ్బంది వెంటనే డోర్ మూసివేశారు. అనంతరం రాంచీ ఎయిర్‌పోర్టులో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్‌కు తరలించారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









