బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్ష సూచన
- July 16, 2017
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే రెండు రోజుల్లో ఇది మరింత బలపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రానున్న 24గంటల్లో కోస్తా, తెలంగాణాలో అనేకచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. అల్పపీడనం బలపడి రుతుపవనాలు చురుగ్గా మారే క్రమంలో కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఈ నెల 19 వరకు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది.
అల్పపీడనం బలపడి ఈనెల 18, 19 తేదీలకల్లా వాయుగుండంగా మారుతుందని ఇస్రో కూడా తెలిపింది. ఈ నెల 20 నాటికి ఒడిశాలో తీరం దాటుతుందని పేర్కొంది. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వర్షాలు కురుస్తాయని అంచనావేసింది.ఈనెల 18న విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోని పశ్చిమ ప్రాంతం, వాటికి ఆనుకుని వున్న తెలంగాణాలో అతిభారీ వర్షాలు (20 సెంటీమీటర్ల వరకు) కురిసే అవకాశముందని తెలిపింది. వాయుగుండంతీరం దాటి బలహీనపడినా ఛత్తీస్గఢ్, తెలంగాణాల్లో వర్షాలుకురుస్తాయని, పరీవాహక ప్రాంతాల్లో భారీ వరద లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







