గైడింగ్‌ లైట్స్‌ని ఢీకొన్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం

- July 17, 2017 , by Maagulf
గైడింగ్‌ లైట్స్‌ని ఢీకొన్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం

ఎయిర్‌ ఇండియా ఎక్‌ప్రెస్‌ విమానం దుబాయ్‌ నుంచి మంగుళూరుకు వెళుతున్న సమయంలో రన్‌వేపై గైడింగ్‌ లైట్స్‌ని ఢీకొంది. ల్యాండింగ్‌ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఐఎక్స్‌ 814 విమానానికి ఈ ప్రమాదం జరగ్గా, ప్రమాద కారణాలపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌కి సైతం ఎలాంటి డ్యామేజీ జరగలేదు. ఫ్లైట్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఎయిర్‌క్రాఫ్ట్‌ స్కిడ్‌ అవలేదని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com