ఫేక్ టిక్కెట్లు విక్రయించిన ట్రావెల్ ఏజెన్సీ వర్కర్
- July 17, 2017
షార్జా: ట్రావెల్ ఏజెన్సీకి చెందిన బుకింగ్ ఉద్యోగి అక్రమంగా ఫేక్ టిక్కెట్లను విక్రయిస్తున్నందుకుగాను అరెస్ట్ అయ్యాడు. 400,000 దిర్హామ్‌ల విలువైన ఫేక్ టిక్కెట్లను నిందితుడు విక్రయించినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. ఫేక్ ఆఫర్లతో వినియోగదారుల్ని నిందితుడు బురిడీ కొట్టించాడని పోలీసులు చెప్పారు. చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించగా అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు వివరించడం జరిగింది. నిందితుడి వద్ద టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు, అవి ఫేక్ అని తెలియక విమానాశ్రాయినికి వెళ్ళి అక్కడ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారని పోలీసులు చెప్పారు. షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ సైఫ్ మొహమ్మద్ అల్ జారి మాట్లాడుతూ, బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న వెంటనే స్పందించినట్లు తెలిపారు. ఇలాంటి నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







