మసీదులను దోచుకొంటున్న నిందితుడి అరెస్టు

- July 18, 2017 , by Maagulf
మసీదులను దోచుకొంటున్న నిందితుడి అరెస్టు

స్థానిక బుదయ్యాలో పలు మసీదులను దొంగతనాలలో ప్రమేయం ఉన్న ఓ నిందితుడిని ఉత్తర గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా అల్ జైరాన్ సోమవారం  ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రెండు మసీదులలో డబ్బుని, విలువైన వస్తువులను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.మొదటి కేసుకు సంబంధించిన నివేదికలు అందిన వెంటనే రెండవ దోపిడీపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు కల్నల్ అల్ జైరాన్ పేర్కొన్నారు. అదే నిందితుడు మరొక మసీదు దోపిడీలో పాల్గొన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ దొంగ దోచుకున్న వస్తువులలో డబ్బు మరియు కంప్యూటర్ ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ఈ  కేసును సూచించి  చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని పోలీస్ అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com