ముగ్గురికి నచ్చని కథ హీరోవరుణ్ కు నచ్చింది
- July 18, 2017
వరుస ప్లాప్స్ తో ఇబ్బందులో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్.ప్రస్తుతం ఫిదా మూవీ ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ తోనే తన జాతకం నిలిబడి ఉందని ఫిలిం సర్కిల్లో అంత మాట్లడుకుంటున్నారు. ఈ నెల 21 ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా కథ కు సంబదించిన ఓ న్యూస్ బయటకు వచ్చి మెగా అభిమానులను ఖంగారు పెడుతుంది. ఈ మూవీ కి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల మొదట ఈ కథ ను ముగ్గురు హీరోలకు వినిపించాడట.
అయితే ఏ ఒక్కరు కూడా ఈ కథ ఫై ఇంట్రస్ట్ చూపించలేదట. ఈ విషయాన్ని దిల్ రాజే పరోక్షంగా చెప్పాడు. ఈ సినిమా కథ చాన్నాళ్ల కిందటే తనకు శేఖర్ చెప్పాడని, స్టార్ హీరోతో రూపొందించాలని అనుకున్నామని అందుకే ముగ్గురు హీరోలకు ఈ సినిమా కథను వివరించామని రాజు చెప్పాడు. అయితే వారెవరితోనూ ఈ సినిమా పట్టాలెక్కలేదని.. వరుణ్ తేజ్ అయితే కరెక్ట్ అనిపించి ఈ హీరోతో ఈ కథను తెరకెక్కించామని రాజు చెప్పుకొచ్చాడు.
మరి వారికీ నచ్చని కథ మెగా హీరోకు నచ్చడం అనేది ఇప్పుడు మెగా అభిమానులను భయపెడుతుంది. మరి వరుణ్ కు అంతగా నచ్చిన ఈ కథ ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది అనేది చూడాలి.
తాజా వార్తలు
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్







