నింగికెగసిన మరో తార
- July 18, 2017
తన నటన, సంగీతంతో అశేష ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న నటి, గాయని బిదిశా బెజ్బరువా అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయారు. అసామీ నటిగా పాపులర్అయిన బిదిశా.. ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టారు. సోమవారం ఢిల్లీ శివారు గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరివేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బిదిశా స్వస్థలం గువాహటి. చిన్నతనం నుంచే సంగీతం, నటనల పట్ల శ్రద్ధకనబర్చిన ఆమె.. టీనేజ్‌లో ఉండగానే రంగప్రవేశం చేసింది. అసామీ నాటకాలు, సంగీత కార్యక్రమాల ద్వారా పేరు సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ‘జగ్గా జాసూస్’ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. కెరీర్ కీలక దశలో ఉన్న తరుణంలో బిదిశా మరణవార్త ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏడాది కిందటే.. గుజరాత్‌కు చెందిన నిశీత్ ఝా అనే వ్యక్తితో బిదిశ వివాహం జరిగింది. అయితే, నిశీత్ కుటుంబీకులు బిదిశను వేధింపులకు గురిచేయడంతో ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారామె. కాగా, భర్తతో మాత్రం సత్సంబంధాలే కొనసాగుతున్నట్లు తెలిసింది. బిదిశ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు భర్తతో కలిసి టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. బిదిశది ఆత్మహత్యేనా? లేక మరొకటా? అనేది ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









