వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా రిలీఫ్ పొందదలచిన ఎయిర్ ఇండియా!
- July 18, 2017
తీవ్ర నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగుతున్న ఎయిరిండియా సంస్థ, తమ ఉద్యోగుల్లో కొంతమందిని వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా వదులుకోవాలని చూస్తోంది. కంపెనీలో ఉన్న మొత్తం 40వేల మంది ఉద్యోగుల్లో మూడో వంతు మందికి ఈ ఆఫర్‌ను ప్రకటించాలని ప్లాన్ చేస్తుందని కంపెనీకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. దీనికోసం ప్రతిపాదనలను కూడా సిద్ధంచేస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ ఎయిరిండియా కనుక ఈ ఆఫర్ ప్రకటిస్తే, ప్రభుత్వరంగ సంస్థల అతిపెద్ద ఆఫర్‌లలో ఇది కూడా ఒకటిగా నిలువనుంది. మరోవైపు ఎయిరిండియా అమ్మకానికి సర్వం సిద్ధమైంది. కొనుగోలుదారుడి ఎంపికలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. టాటా గ్రూప్ వంటి దిగ్గజాలు దీని కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎయిరిండియాను మొత్తానికి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, ప్రభుత్వం పూర్తిగా చేతులు దులిపేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఎయిరిండియా తన వ్యయాలను తగ్గించుకోవడానికి ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారాన్ని రద్దు చేసింది. కేవలం శాకాహారమే ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పింది. 40వేల మంది ఉద్యోగుల్లో 15వేల మందికి ఎలా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఆఫర్ చేస్తారో తెలుపుతూ నివేదిక తయారుచేసి తమకు అందించాలని ఎయిరిండియాను ఏవియేషన్ మంత్రిత్వశాఖలోని టాప్-బ్యూరోక్రాట్‌లు సంస్థను ఆదేశించినట్టు కూడా సీనియర్ అధికారి చెప్పారు. ''ఇంకా ఏదీ ఖరారు కాలేదని కానీ ఎయిరిండియా అమ్మకాన్ని ఎంత సరళమైన రీతిలో అయితే అంతే సరళమైన ప్రక్రియలో చేపడతాం'' అని రెండో టాప్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం తాజాగా వచ్చే పెట్టుబడులను కూడా హోల్డ్‌లో పెడుతున్నారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









